ప్రతి ఆడపిల్ల , మహిళ ఆదిశక్తి లాంటివారు. -డా. నైనా జైశ్వాల్ 

అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం -

ప్రతి ఆడపిల్ల , మహిళ ఆదిశక్తి లాంటివారు. -డా. నైనా జైశ్వాల్ 

  • ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

విశ్వంభర,హైదరాబాద్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని నారాయణగూడ  రాజ్ మొహాల్ల లోని పద్మశాలి భవన్ లో అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం ప్రెసిడెంట్ వనం దుశ్యంతల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేటర్ , ఇంటర్నేషనల్ టిటి ప్లేయర్ , యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ డా.  నైనా జైశ్వాల్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలందరూ అన్ని రంగాలలో ముందుకు సాగాలని మహిళల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటుపడేలా కృషి చేయాలని ఆమె అన్నారు. ప్రతి ఆడపిల్ల , మహిళ ఆదిశక్తి లాంటివారు అని అన్నారు. ప్రస్తుత సమాజంలో దేనిని గుడ్డిగా నమ్మకుండా మహిళలంతా ఆత్మస్థైర్యం తో బలంగా నిలబడాలని అన్నారు. తల్లితండ్రుల ఆశలను వమ్ము చేయకుండా జీవితంలో అనుకున్నది సాధించాలని అన్నారు. డా. నైనా జైశ్వాల్ సోదరుడు అగస్త్య జైశ్వాల్ , తల్లి భాగ్యలక్ష్మి హాజరయ్యారు.  గీవ్ టూ గెయిన్ అనే ధీమాతో మహిళల రక్షణకై , సాధికారతతో మహిళా లోకం అంతా ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన మహిళ ప్రముఖుల ప్రసంగాలు , చిన్నారులు ఆటపాటలు , కూచిపూడి నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రంగాలలో ప్రతిభ గల  మహిళా నారీమణులకు సన్మాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ చిలివేరు సునీత ,  జాయింట్ సెక్రటరీ  యమదుల వాణి , ట్రెజరర్ మిర్యాల విశ్వరేఖ , బండారి లక్ష్మి , పొట్టబత్తిని అరుణ , గడ్డం కీర్తన , కృష్ణసంతోషి, భువనేశ్వరి , బొడ్డు అశ్విత , అయిటిపాముల స్రవంతి, వర్ణలీల, యశోద, డా.సమత, అమరావతి , సుజాత , బొమ్మ ప్రవళిక , గుంటుక రూప , పోరండ్ల శారద, తదితరులు పాల్గొన్నారు.

Tags: