నూతన కార్యవర్గం ఏర్పాటు 

నూతన కార్యవర్గం ఏర్పాటు 

విశ్వంభర, మేకల మండి : తెలంగాణ బోనాల ఉత్సవాల లో భాగంగా గాంధీనికేతన్ లోని శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ మేకల మండిలో నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగిందని అధ్యక్షుడిగా జగదీశ్వర్ గౌడ్, ట్రెజరర్ శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ రాజు, చౌదరి  స్వామి, వైస్ ప్రెసిడెంట్ పెంటయ్య, సలహాదారులుగా అశోక్ నియమితులయ్యారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పంచామృత అభిషేకం, లక్ష పుష్పార్చన, దేవి హోమం నిర్వహించినట్టు నూతన అధ్యక్షులు జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ సంవత్సరం ఎలాంటి లోటుపాటులు లేకుండా చూస్తానని అమ్మవారి దయతో నాకు ఇచ్చిన ఈ అధ్యక్ష పదవికి న్యాయం చేస్తానని అమ్మవారి సాక్షిగా తెలుపుతున్నానని అన్నారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని వేడుకున్నానని వర్షాలు సకాలంలో రావాలని పాడిపంటలు మంచిగా పండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని అన్నారు.

Tags: