ఎన్యూమరేషన్ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలి
విశ్వంభర, అంబర్‌పేట : ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా పూరించి నిర్ణీత గడువులోగా సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, హైదరాబాదు అంబర్‌పేట నియోజకవర్గం బీఎల్‌ఏ-1 ఏడెల్లి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.జాతీయ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అంబర్‌పేట డివిజన్ పోలింగ్ బూత్ నంబర్–146లో బీఎల్‌వో అధికారి బానోత్ రవికుమార్‌తో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ప్రతి ఓటరు ఫారాన్ని పూర్తిగా పూరించి నిర్ణీత గడువులోగా అధికారులకు అందజేయాలని, లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో: బీఎల్‌ఏ-2 గడ్డం భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.