కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. సజయంతి సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం నిర్వహించి, రకాల పండ్లు, పూలతో అలంకరించారు. 

వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు తరలివచ్చారు. భక్తులతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు దీక్షలను విరమించారు. దీక్షాపరులతో ఆలయ పరిసరాలన్నీ కాషాయవర్ణాన్ని సంతరించుకున్నాయి.

Read More గజ్వేల్ లో మెగా రక్తదాన శిబిరం

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో 650మంది పోలీసులతో భద్రతాచర్యలు చేపట్టారు. కోనేరులో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. కొండపైకి నాలుగు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

 

Advertisement

LatestNews