రావిరాల యూపీఎస్ విజిట్ చేసిన డీఈఓ
On
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని రావిరాల యూపీఎస్ ను డీఈవో రవీందర్ రెడ్డి సోమ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల, హాజరు,అసైన్మెంట్స్ మార్కుల రిజిస్టర్ లను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల నైపుణ్యాల పై ఆరా తీశారు.మిడ్ డే మీల్స్ చూసి,మెనూ ప్రకారం పరిశుభ్రంగా,నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీకి చెప్పారు.అనంతరం టీచర్స్ తో సమీక్ష లో విద్యార్థులలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించినట్లయితే పై తరగతులలో సులభతరమవుతుందని సూచించారు. సమయపాలన పాటించి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ రాందాస్ , తోరూర్ ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాయపు లింగారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



