స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చండి : డా. కాచం సత్యనారాయణ
- ఈడబ్ల్యూఎస్‌లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి
- మార్చి నెలలో వైశ్య రాజకీయ రణ భేరి ఏర్పాటు చేస్తాం
- బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం
- వైశ్య సమాజం కోసం, వైశ్య జాతికోసం ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక
విశ్వంభర , హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఆధారంగా త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాట తేల్చాలని వైశ్య వికాస వేదిక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ డిమాండ్ చేసారు . బీసీ లకు 42 శాతం ' ఎస్సి వర్గీకరణ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం , సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు . అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే ఈడబ్ల్యూఎస్ లో కూడా వర్గీకరణ చేయాలనీ డిమాండ్ చేసారు. మాకు వేరే వాళ్ళ వాటా అవసరం లేదని మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు మా రాజకీయ వాటా ఇవ్వాలని పేర్కొన్నారు . ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఆధారంగా మా వైశ్య జనాభా ఎంతో చెప్పాలని, దాని ప్రకారం మా వాటా తేల్చాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మా రాజకీయ వాటా తేల్చకపోతే మార్చి నెలలో ఎన్టీఆర్ స్టేడియం లో తెలంగాణ లో ఉన్న వైశ్యులందరిని ఏకం చేసి వైశ్య రాజకీయ రణ భేరి ఏర్పాటు చేసి మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు . సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యములో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అస్తిత్వం కోల్పోతున్న వైశ్యుల కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక తెలిపారు. వైశ్యుల్లో సంఘాల పరంగా ఐక్యత ఉన్న , రాజకీయ పరంగా అనైక్యత లోపించిన నేపత్యం లో మా వైశ్య వికాస వేదిక లో 102 మంది సభ్యులతో ఓక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వైశ్యుల కోసం పనిచేస్తున్నమన్నారు . గతం లో నోట్ల రద్దు విషయం లో మరియు జీఎస్టీ వచ్చినపుడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వైశ్యుల కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు . వైస్యులో ప్రతిభ కలిగిన విద్యార్ధిని , విద్యార్థులకు 95 శాతం మార్కులు సాధించిన దాదాపు ఐదు వేల మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక అని తెలిపారు . మాకు ఏ సంఘాలతో పోటీ లేదని, సమాజం లో అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసుకు రావడమే మా లక్ష్యం గా మేము పోటీ పడుతున్నామన్నారు. వైశ్య జాతి యొక్క రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యం లో వైశ్య సమాజం కోసం, వైశ్య జాతికోసం మా వైశ్య వికాస వేదిక ముందుండి పనిచేస్తుందని తెలిపారు . వైశ్యుల ఆత్మ గౌరవం హక్కుల సాధనకై 2023 అక్టోబర్లో ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో పదివేల మందితో వైశ్య గర్జన పేరుతో పది అంశాలతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ డబ్ల్యూఎస్ లో వర్గీకర చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉంది దాదాపు చట్టసభల్లో 15 మంది ఎమ్మెల్లేలు , ఎమ్మెల్సీగా ఉన్న నేపత్యం కానీ ఇప్పుడు ఒక్క శాతానికి పడిపోయి ఒకే ఒక ఎమ్మెల్లే ఉన్న పరిస్థితి ఉందన్నారు. 2023 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వైశ్యులకు టికెట్ లు కేటాయించాలని డిమాండ్ చేశామని కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వలేదని , మరోవైపు బీజేపీ , బిఆర్ఎస్ పార్టీలు ఒకే స్థానములో ఇద్దరు వైస్యులకు సీటు కేటాయించి అన్యాయం చేసాయని తెలిపారు . అందుకే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు కల్పించాలని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు విజ్ఞప్తి చేసారు . లేని పక్షం లో మమ్మల్ని ఆదరించిన పార్టీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ప్రకటిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమం లో వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరి రమేష్, కోశాధికారి రామ్ నరేష్, ట్రస్టీ కాచం ఏక సాయి, గౌరవ సలహా దారులు బుక్క ఐశ్వరయ్య,లీగల్ అడ్వాయిజర్ సముద్రాల రమేష్ గౌరవ సలహాదారులు సముద్రాల రమేశ్, ఉప్పల శ్రవణ్ కుమార్, ప్రభుగుప్త, కూర రమేశ్, జి.సత్యనారాయణ, నవీన్, మనోహర్, రాంబాబు పలువురు వైశ్య వికాస వేదిక ట్రస్టీ సభ్యులు పాల్గొన్నారు.



