క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయం
- రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
విశ్వంభర, పెద్దపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పోటీలను నిర్వహించి క్రీడాకారులను వెలికి తీయడం హర్షనీయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల స్టేడియంలో శ్రీపాదరావు స్మారక కమాన్ పూర్ లీగ్ (కేపీఎల్) పోటీలను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఇటీవల 8 జట్ల క్రీడాకారులను సయ్యద్ అన్వర్, అంబిరి శ్రీనివాస్, ఇనగంటి రామారావు, ముస్త్యాల దామోదర్, మెహరాజ్ ఖాన్, రెబల్ రాజ్ కుమార్, పీట్ల గోపాల్ ,కుక్క కుమార్ జట్ల యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తాను బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నానని క్రీడలను ప్రోత్సహించడమే తమ ధ్యేయమని అన్నారు, కమాన్ పూర్ లో స్థల సేకరణ చేస్తే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని అన్నారు,. మనదేశంలో క్రికెట్ ప్రాచుర్యం పొందిందని చాలామంది భారతీయులు క్రికెట్ ను అభిమానిస్తారని పేర్కొన్నారు. 28 రోజులపాటు కమాన్ పూర్ మండల కేంద్రంలో కేపీఎల్ పోటీలతో యువతకు ఉచ్చాన్నిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్,సర్పంచులు రంగు సత్యం ,షీలారపు మల్లయ్య, బంగారు కళ్యాణి ,పోనగంటి కుమార్, నాయకులు నాయకులు ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్, పిల్లి శేఖర్, పిల్లి రాజు,కమ్మగొని చౌదరి,కటకం రవీందర్ చొప్పరి శేఖర్, గడ్డం శ్రీనివాస్, బాద్రాపు శంకర్, జంగేపల్లి శ్రీనివాస్(గేల్) బొజ్జ సాగర్ తదితరులు పాల్గొన్నారు.



