త్యాగరాజ గాన సభలో భారతరత్నం పురస్కారాలు
విశ్వంభర, చిక్కడపల్లి: హైదరాబాదు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో కళా వెంకట దీక్షితులు వేదిక మీద భారతరత్నం పురస్కారం ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల విద్యారంగంలో చేస్తున్న కృషిని, ప్రతిభను, గుర్తించి హార్ట్ ఆఫ్ లెర్నింగ్ సంస్థ ఆర్గనైజర్స్ కామరాజు రామారావుకు బోధన సామ్రాట్ బిరుదుతో పాటు భారతరత్నం పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చలనచిత్ర దర్శకులు ఆకుల రమేష్ రాజా, తెలంగాణ రాష్ట్ర సాక్ష్యం అధ్యక్షులు డి సుభాష్ గుప్తా, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ప్రణయ్, ఆర్ స్నేహ రెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ దుర్గం రాజేష్ గౌడ్, దుర్గ భవాని, మురళీకృష్ణ, అపర మేధావి గుగ్గిళ్ళ దివ్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత కామరాజు రామారావు మాట్లాడుతూ, పురస్కారం త్యాగరాజ గాన సభలో ఇంత మంది ప్రముఖుల మధ్య అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, అవార్డుకు ఎంపిక చేసినందుకు హార్ట్ ఆఫ్ లెర్నింగ్ సంస్థ ఆర్గనైజర్స్ శ్రీనాద మునుల రామారావు, అభినందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.



