ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి సీపీఎం మద్దతు 

* మతోన్మాద బీజేపీని ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి

ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి సీపీఎం మద్దతు 

విశ్వంభర, కరీంనగర్: కరీంనగర్లో సీపీఎం నాయకులు సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మద్దతు ప్రకటించారు. ఉమ్మడి నాలుగు జిల్లాలలో నలుగురు 
బీజేపీ ఎంపీలు ఉండి కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆరోపించారు. తెలంగాణ విభజన హామీలను ఏ ఒక్కటి బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉండి సైనిక్ పాఠశాల గాని, కొత్తగా నవోదయ పాఠశాలలు గాని, సైనిక్ పాఠశాలలు తీసుకు రాలేదని, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ విభజన హామీలలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి పని సాధించకుండా, బీజేపీ కేవలం కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులనుమభ్యపెట్టిఅధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారవేత్త, అనుభవరహితుడైన అంజిరెడ్డికి టిక్కెట్ ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు గమనించి బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని నగర కార్యదర్శి గుడికందుల సత్యం కోరారు.

Tags: