నోష్ లాబ్ లో ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
On
విశ్వంభర, చిట్యాల: వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ లాబ్ లో నిన్న జరిగిన ప్రమాదంపై కంపెనీ ముందు ధర్నాకు దిగిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ నాయకులు. ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కార్మికునికి కుటుంబానికి 2కోట్ల నష్టపరిహారం చెల్లించి, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నోష్ లాబ్ పై చటపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



