ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిరసన
- -మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మల దహనం
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల అరెస్టును ఖండిస్తూ ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి నిరసన ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, దేశచరిత్రలో ఏనాడూ చోటుచేసుకోని పరిణామాలను నేడు చూస్తున్నాం. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ప్రశ్నాపత్రాల విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించటమే కాకుండా, ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులతో అణిచివేయాలని చూడటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి నేటి వరకు గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలన మాదిరిగానే నేడు కేంద్రంలో పరిస్థితి మారింది. ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు అని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, విద్యార్థులు, యువత, ప్రజల ఆగ్రహం త్వరలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందని అన్నారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యార్థులకు న్యాయం చేస్తాం, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం అని భరోసా ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరె సికిందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షలు జడల రవీందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు బాలశివుడు గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, మున్సిపల్ కౌన్సిలర్లు నీళ్ల భాను గౌడ్, దారు రాఘవేంద్రరావు, ఎన్ ఎస్ యు ఐ నియోజవర్గ అధ్యక్షులు నందకిషోర్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.