IMP అభివృద్ధి పనులను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
విశ్వంభర, ఎల్బీ నగర్: మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కె.బి.ఆర్. గార్డెన్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.2023 నవంబర్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు, నియోజకవర్గంలో 15 కొత్త పార్కులను మంజూరు చేశామని, అయితే ఎన్నికల నిబంధనల కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడిందని తెలిపారు. కొన్నింటికి కోర్టు వ్యవహారాలు కారణమని, మరో 6 పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ 15 నెలలు గడిచినా, కొన్ని పార్కులు ప్రారంభించకుండా తాళాలు వేసి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇంచార్జ్ మంత్రి చే ప్రారంభిస్తామన్నప్పటికీ, ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదా అని ఎద్దేవా చేశారు. ఈ పార్కులు ప్రారంభమైతే తనకు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ నాయకులు భయపడి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. మరో రెండు రోజుల్లో పార్కులు ప్రారంభించకపోతే, తాము స్వయంగా వెళ్లి తాళాలు తెరిచి ప్రజలకు పార్కులను అందుబాటులోకి తీసుకువస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్
నాయకులు నిధులు తేవడంలో విఫలమయ్యారు అని విమర్శించారు. ఎన్నికల ముందు మేము మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని స్పష్టం చేశారు. అలాగే కొన్ని కోట్ల రూపాయల నిధులతోకామినేని ఫ్లైఓవర్ క్రింద ఆక్సిజన్ విడుదల చేసే దాదాపు 26 రకాల మొక్కలు దాదాపు 36,000 మొక్కలను నాటించామని,వాటిని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని గుర్తుచేశారు.అప్పటి కమిషనర్ పార్కులో టిక్కెట్ విధించాలని నిర్ణయించగా, తాను నిరాకరించానని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జోనల్ కమీషనర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు అని హెచ్చరించారు. జి.ఓ.118 మరియు లారీల అడ్డా విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.కొన్ని రోజులుగా తన ఆరోగ్యం బాగోలేక ఇంటివద్దనే ఉండాల్సి వచ్చినప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నానని తెలిపారు. ప్రజల ప్రేమ, అభిమానం, ఆశీర్వాదం వల్ల ఇప్పుడు తన ఆరోగ్యం మెరుగైందని పేర్కొన్నారు.అయితే, తన ఆరోగ్యం గురించి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని, తనకు కాన్సర్ వచ్చిందని, తిరిగి నియోజకవర్గానికి రారని, బై-ఎలక్షన్ వస్తుందని ఆశపడ్డారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకుని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తనపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలో మాన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి,ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారస పార్టీ యూత్ అధ్యక్షులు రవి ముదిరాజ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరి,జగదీష్ గౌడ్,విజయ్ భాస్కర్ రెడ్డి, కడమంచి ఆనంద్, సదానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



