కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. ఖండించిన సీఎం రేవంత్ ?
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది 2024 జూన్ 12వ తేదీకి హైదరాబాద్ విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఇలాంటి తరుణంలోనే హైదరాబాద్ గురించి పెద్ద ఎత్తున వార్తలు గత కొంతకాలంగా వినపడుతూనే ఉన్నాయి హైదరాబాద్ త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంగా కాబోతుందంటూ వార్తలు వచ్చాయి.
ఇదే విషయం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే అందుకు సంబంధించిన సమావేశాలు కూడా పూర్తి అయ్యాయి అంటూ ఈయన ఆరోపించారు అయితే ఈ ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు.
మీడియా సమావేశంలో భాగంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజమని ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెబుతూ కేటీఆర్ అలా మాట్లాడటం సరికాదని తెలిపారు. ఎట్టి పరిస్థితులలో కూడా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.. ఈసారి కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కనుక ప్రజలు ఎవ్వరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.