విద్యార్ధినులకు అభినందనలు
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు భువనగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలో పాల్గొన్నారు. వీరిలో 8వ తరగతి విద్యార్థినులు లయ, శిరీషలు 2 స్వర్ణ పతకాలు సాధించగా, 9వ తరగతి విద్యార్థినులు దేవిక, ఇందు, ప్రత్యుషలు 3 రజత పథకాలు సాధించారు. ఐదుగురు విద్యార్థినులు కాంస్య పతకాలు సాధించి తమ సత్తాను చాటారు. విజయం సాధించిన విద్యార్థినులను ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ అభినందించి మెడల్స్ ను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.శేఖర్, ఏ.ఏ.పిసి చైర్మన్ మమత, కరాటే కోచ్ లు అప్పం చెన్నకేశ్వర్, తెల్ల ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



