ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం 

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం 

విశ్వంభర, మహాదేవపూర్:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా  మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరించారు.  అనంతరం రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ 1980లో ఏప్రిల్ 6 న స్థాపించబడి అంత్యోదయ లక్ష్యంతో పనిచేస్తూ నేడు ప్రపంచంలో అతి పెద్ద పార్టీ గా అవతరించిoదని అన్నారు. భారతదేశాన్ని 12సంవత్సరాలపైగా పరిపాలన చేస్తూ అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ నేత్రుత్వంలో బీజేపీ మొదటి అధ్యక్షులు అటల్ బిహారి వాజ్పేయి, అభినవ సర్దార్ లాల్ కృష్ణ అద్వానీ స్ఫూర్తితో  అంచెలంచలుగా ఎదిగి నేడు అజేయ శక్తిగా నిలిచిన భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక రాష్టాలలో అధికారంలో ఉందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ద్యేయంగా వికసిత్ భారత్ నిర్మాణం లో భాగమై ప్రతి కార్యకర్త పనిచేయాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, ఉపాధ్యక్షులు అంకరి రాజేందర్, ఓబీసీ మోర్చ ప్రెసిడెంట్ సాగర్ల రవి, వార్డ్ సభ్యులు సోన్నారి శ్యామ్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య,  దడిగేలా వెంకటేష్, నాగుల సాయి, ,రాజు, రాకేష్, అర్జున్, లక్కీ, జనసేన నాయకులు అభినష్, రాజేష్, అభిమానులు పాల్గొన్నారు.

Tags: