అంగన్వాడీలో అన్నప్రాసన్న కార్యక్రమం
On
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం తిమ్మాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ బట్టు వైష్ణవి మాట్లాడుతూ, మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య భాషాభివృద్ధి సృజనాత్మకత పజిల్స్ ఆర్ట్ కార్నర్ నాటకీకరణ ఆటపాటలతో విద్యను బోధిస్తున్నారని పిల్లల మానసిక శారీరక సాంఘిక అభివృద్ధికి పునాది వేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతినెల పిల్లల బరువు కొలిచి తల్లులకు తగు సలహాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ బట్టు వైష్ణవి, ఏఎన్ఎంలు పరకాల మమత, కృష్ణవేణి,ఆశా కార్యకర్త రాచమల్ల రజిత,ఆయా ఎండి నశ్రీన్, పిల్లల తల్లులు,గర్భిణీ స్త్రీలు,చిన్నపిల్లలు పాల్గొన్నారు.



