ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యం
విశ్వంభర, మహాదేవపూర్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సూరారం గ్రామ ఉపసర్పంచ్ చల్ల చిన్నన్న తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని 10 వ వార్డు పరిధిలో లబ్ధిదారులు తూడిచెర్ల మరియమ్మ ఆయిల్ల విజయ లక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైయ్యాయి. కాగా సూరారం గ్రామ సర్పంచ్ మేకల శంకరమ్మ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి బండం అంజలి పాలకవర్గం తో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా చల్ల చిన్నన్న మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం లో నిరుపేదలైన పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. త్వరలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో గ్రామంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల ను తీసుకుని వచ్చి నిరుపేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓడెటి లక్ష్మారెడ్డి, చల్ల మహేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్ తూటిచెర్ల శేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్ల రమేష్ రెడ్డి, మడక ప్రతాప్ రెడ్డి, తదితరులు ఉన్నారు.



