బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం
On
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 10న జరుగనున్న సందర్భంగా సోమవారం వరంగల్ జిల్లా కోర్టు ఆవరణలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న చకిలం ఉపేందర్ న్యాయ వాదులను కలుస్తూ తనపై నమ్మకంతో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్దించారు. తాను గెలిస్తే న్యాయవాదులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఆయన వెంట జిల్లా న్యాయవాదులు పాల్గొన్నారు.



