నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి 

నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి 

విశ్వంభర, రామన్నపేట: అసెంబ్లీ నియోజకవర్గాల పెంపులో భాగంగా రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి, కోర్టు, డివిజన్ ఆఫీసులు, అన్ని కార్యాలయాలు ఉండి గతంలో కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామన్నపేటను ప్రస్తుతం పెంచే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించేదాకా అందరు ముక్తకంఠంతో ఏకతాటిపై ఉండి నియోజకవర్గం సాధించుకునే విధంగా భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల పార్టీ అధ్యక్షులు మీర్జా ఫజల్ బేగ్, చేనేత నాయకులు గోశిక చక్రపాణి, తెలుగుదేశం పార్టీ రామన్నపేట బిసి సెల్ మండల అధ్యక్షులు పున్న వెంకటేశం, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

Tags: