మృతుల కుటుంబాలకు ఆర్ధికసాయం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన చల్లమల్ల జగన్నాథం భౌతిక కాయానికి గ్రామ సర్పంచ్ కందిమళ్ళ గోపాల్ రెడ్డి, చల్లమల్ల జగన్నాథం పూలమాల వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే నీర్నెముల గ్రామానికి చెందిన ఆవుల స్వామి మృతి చెందగా, సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆవుల స్వామి భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత సత్య ప్రకాష్, నాయకులు చిరంజీవి, జితేందర్, క్రాంతి కుమార్, అశోక్, గణేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags: