చలివేంద్రం ప్రారంభం 

చలివేంద్రం ప్రారంభం 

 విశ్వంభర, భూపాలపల్లి:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ఆవరణలో ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దాతల సహకారముతో ఈ ఎండాకాలం లో బాటసారులు, ప్రయాణికుల దప్పిక తీర్చడానికి చలివేంద్రాన్ని ట్రాఫిక్ ఏ ఎస్ పి సతీష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమములో ఆత్మీయత సేవా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్, ప్రధాన కార్యదర్శి మాటూరి క్రాంతికుమార్, ఉపాధ్యక్షులు పైండ్ల తిరుపతి,  కోశాధికారి బండి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి పాదం కుమారస్వామి, సహాయ కార్యదర్శి కర్ర శ్రీనివాస్, సభ్యులు దేవేందర్, రమేష్, షాకీర్, రప్ సింగ్, సంతోష్ పాల్గొన్నారు.

Tags: