ఘనంగా నల్లమల గిరిప్రసాద్ జయంతి
విశ్వంభర, హిమాయత్ నగర్: సిపిఐ అగ్ర నాయకుడు, మాజీ ఉప ప్రధాన కార్యదర్శి నల్లమల గిరి ప్రసాద్ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాదు హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటి నరసింహ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్. ఛాయాదేవి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలపర్చడానికి అనేక త్యాగాలు చేసిన వ్యక్తిగా గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి కమ్యూనిస్టు నడుం బిగించి ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, హైదరాబాద్ జిల్లా సిపిఐ నాయకులు చెట్టుకింద శ్రీను, శ్రీరాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.



