‘మన ఇసుక వాహనం’ పథకాన్ని వినియోగించుకోవాలి

‘మన ఇసుక వాహనం’ పథకాన్ని వినియోగించుకోవాలి

విశ్వంభర, సిద్దిపేట: జిల్లాలో ఇసుక సరఫరా ప్రక్రియను పారదర్శకంగా, అవినీతి రహితంగా, సామాన్యులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం "మన ఇసుక వాహనం" పథకాన్ని ప్రవేశపెట్టిందని సీపీ రష్మీ పెరుమాళ్ సోమవారంనాడొక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tgmiv.cgg.gov.inని సందర్శించి, వివరాలతో రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తు సమర్పించిన తర్వాత నిర్ణీత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని చెప్పారు. దరఖాస్తును సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ పరిశీలించి ఇసుకను మంజూరు చేస్తారని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే రేట్లు చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, మధ్యవర్తులను ఆశ్రయించొద్దని చెప్పారు. జిల్లా ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Tags: