మృతురాలి కుటుంబానికి బీఆర్ఎస్ శ్రేణుల భరోసా
On
విశ్వంభర, కడ్తాల్: కడ్తాల మండల కేంద్రానికి చెందిన మూడ నర్సమ్మ కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతిచెందారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు మాజీ జడ్పీటీసీ దశరత్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి ఇతర నేతలతో కలిసి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ 5,000/- మాజీ వైస్ ఎంపీపీ 5,000 మరియు మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి 5,000/- చొప్పున వారి కుటుంబానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, మాజీ రైతు డైరెక్టర్ మంగళ పల్లి నర్సింహ్మ మాజీ వార్డు సభ్యులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.