హైకోర్టు తీర్పు హర్షణీయం

హైకోర్టు తీర్పు హర్షణీయం

విశ్వంభర, రామన్నపేట: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని, ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం అన్నారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించడం హర్షనీయమని కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని తాగు, సాగు పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో కాళేశ్వరం కీలకంగా మారిందని తెలియజేశారు.

Tags: