విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా బైజూస్ ఐఏఎస్ సంస్థ

హైదరాబాద్, జూలై 24(విశ్వంభర) : - కోర్స్ పూర్తి కాకముందే బోర్డు తిప్పేసిన బైజుస్ ఐఏఎస్ కౌచింగ్ సెంటర్ ముందు బాధిత విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నారాయణగూడ లోని బైజుస్ ఐఏఎస్ కౌచింగ్ సెంటర్ కార్యాలయం ముంది బైఠాయించిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2022 -24 కోర్స్ కోసం ఒక్కొక్కరి వద్ద ఒక లక్ష యాభై వేలు వసూలు చేసి , ఇప్పుడు మధ్యలోనే తమను రోడ్డుపై పడేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ లో ఉద్యోగం సాధించాలని ఈ కోర్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే బైజుస్ సంస్థ 50 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదని... ఇప్పుడు కోచింగ్ సెంటర్ కు తాళాలు చేశారని వాపోయారు. కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ ను ఆడితే , కోర్టులో కేసు నడుస్తుంది , తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు ఎత్తేశారని తెలిపారు. బైజుస్ ఐఏఎస్ కౌచింగ్ సెంటర్ వల్ల తాను సమయాన్ని , డబ్బును పోగొట్టుకున్నామని , రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ... తమకు ప్రత్యామ్నాయం చూపాలని వేడుకున్నారు.