బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు
On
విశ్వంభర, బంజారాహిల్స్: తెలంగాణ భవన్ లో ఎర్రోళ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావుని గృహ నిర్బంధం చేయడం పై మండిపడ్డారు. రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న మా పార్టీ నాయకులు రైతుల కోసం మాట్లాడుతున్నారని, ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నారని అక్రమంగా అరెస్టు లు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ఎప్పుడూ ఈ రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు వెన్నంటే ఉంటారని అన్నారు.



