జామతండ ప్రాథమిక పాఠశాలలో స్వయంపాలన
On
విశ్వంభర, నల్లికుదురు: మండలంలోని జామ తండ ప్రభుత్వ డి.ఎన్.టి ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులే ఉపాధ్యాయ పాత్ర పోషించి ఘనంగా స్వయం పరిపాలన జరుపుకున్నారు. పాఠశాల స్టూడెంట్స్ హెచ్ఎం గా టీచర్స్ గా తోటి విద్యార్థులకు పాఠాలు బోధన చేయడాన్ని ఉపాధ్యాయులు దూరంగా చాటుగా ఉంటూ పర్యవేక్షించారు. విద్యార్థులకు సమయస్ఫూర్తితో బోధనలో ప్రతిభ కనబరిచిన వారిని అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎ.అనూష, ఉపాధ్యాయులు సిహెచ్.ప్రవీణ్ పాల్గొన్నారు.



