'అమృత వర్షిణి ఆర్ట్స్ '' సినీ సంగీత స్వర సమీరాలు సీజన్ -8
విశ్వంభర, రామ్ కోటి:- అమృత వర్షిణి నాగ భూషణ్ నిర్వహణలో నిర్విరామం గా కొనసాగుతున్న ''అమృత వర్షిణి ఆర్ట్స్ '' సినీ సంగీత స్వర సమీరాలు సీజన్ -8 సరిగా స్టూడియో సుల్తాన్ బజార్ , హైదరాబాద్ లో ఉదయం 9 గం ల నుంచి నైట్ 9 గం ల వరకు నిర్విరామంగా ఎంతో కోలాహలంగా జరిగింది. విభిన్న మైన పాటలతో గాయని గాయకులు అద్భుతంగా పాడి శ్రోతలను అలరించారు. ప్రతి సీజన్ లో గాయకులను చేరదీసి వారికి చక్కని వేదికను ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తున్న అమృత వర్షిణి నాగ భూషణ్ దంపతులను గాయని గాయకులు ఎంతగానో ప్రశంసించారు. అనర్గళంగా. మాట్లాడుతూ.. వాక్యాతగా శ్రీ కూడా.. సింగర్స్ అందరిని ప్రోత్సహిస్తూ నవ్విస్తూ ఈవెంట్ కి ఒక కళ తెచ్చి మా అందరిని ఆనందింప చేశారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన గాయకులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేసారు. గాయని గాయకులకు జ్ఞాపికలను గాయకుడు నాగరాజ్ గారు అందించి వారి సహృదయాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా విజయ వంతం కావడానికి సహకరించిన గాయని గాయకులందరికి అమృత వర్షిణి కృతఙ్ఞతలు తెలియ జేశారు.