అంబేద్కర్ అందరివాడు

అంబేద్కర్ అందరివాడు

విశ్వంభర, అనంతగిరి: అంబేద్కర్ కేవలం కొందరివాడు మాత్రమే కాదు అందరివాడని నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చనుపల్లి గ్రామంలో  మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి అయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భుపాల్ రెడ్డి మాట్లాడుతూ, అంటరానితనాన్ని, అస్పృశ్యతను నిర్మూలించాడానికి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగంతో భారత దేశ పరిపాలన విధానం సమ న్యాయంతో పని చేస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అవసరాలకు మాత్రమే అంబేద్కర్ను వాడుకుంటుందని అన్నారు. అంబేద్కర్ ప్రకటించిన బోధించు, సమీకరించు, పోరాడు అనే విధానంతోనే ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగ హక్కులను అనుభవిస్తూ ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయంతో ప్రతి ఒక్కరూ మెలగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమాదేవి, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, ఏలేటి వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: