బైక్ పక్కకు తీయమన్నందుకు కత్తితో దాడి చేసిన యువకుడు?

బైక్ పక్కకు తీయమన్నందుకు కత్తితో దాడి చేసిన యువకుడు?

బైక్  పక్కకు తీయమన్న పాపానికి ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైనటువంటి మరో యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

బైక్  పక్కకు తీయమన్న పాపానికి ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైనటువంటి మరో యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో బావర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెస్టారెంట్ వద్ద ముగ్గురు యువకులు ఒకే బండి పై ఆగి ఉన్నారు అటుగా వచ్చిన యువకుడు బండి అడ్డు తీయమని చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

 

Read More వ‌న మ‌హోత్స‌వం సామాజిక ఉద్య‌మంగా నిర్వహించాలి : మంత్రి కొండా సురేఖ

అక్కడే ఉన్నటువంటి పలువురు ఈ గొడవ ఆపడానికి ప్రయత్నం చేసిన సర్దుమనగా లేదు దీంతో యాక్టివా పై ఉన్నటువంటి ఇద్దరు యువకులు సురేష్, నాయక్ లప్తె కత్తితో దాడి చేయడంతో సురేష్ తీవ్రగాయలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

 

సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అసలు విషయం తెలుసుకొని ఒక నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఆ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని, త్వరలోనే నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.