పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

విశ్వంభర, రామన్నపేట:  దుబ్బాక గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1999 నుండి 2022 వరకు చదివిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. మొదట వందేమాతరంతో ప్రారంభించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత మరణించిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు అలాగే, భౌతికంగా దూరమైన విద్యార్థులకు సంతాపం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ ఉపాధ్యాయులు మల్లేశం మాట్లాడుతూ, ఆనాటి ఙాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాడు వారు చేసిన కృషి గ్రామ ప్రజలతో గల సంబంధాన్ని గుర్తుచేశారు. వారి వద్ద విద్య నేర్చుకుని వివిధ రంగాల్లో స్థిర పడిన వారిని చూసి ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి ఎక్కడెక్కడో ఉన్న తమ ఉపాధ్యాయులను ఒక్క దగ్గరకు చేర్చినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. చిన్నారుల నృత్య ప్రదర్శన, విద్యార్థుల ఆటపాటలతో ఎంతో ఉత్సాహపూరితంగా వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది ఉపాధ్యాయులు, 22 బ్యాచ్‌లు మరియు 400 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశం, జానకి రాములు, ఆనంద్, లక్ష్మీ నారాయణ్, హెప్సిబా, శ్రీనివాస్, వెంకటేష్, ప్రభాకర్, విజయలక్ష్మి, సురేష్, భిక్షం, భాస్కరచారి, సత్తయ్య, వెంకటచారి, రమేష్, చంద్రశేఖర్, భూపాల్, రవి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement