పచ్చదనం-పరిశుభ్రతపై సమీక్ష
విశ్వంభర, ఆమనగల్లు :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని గ్రామాల్లో పటిష్టంగా అమలుపరిచి విజయవంతం చేయాలని అమనగల్లు మండల ఎంపీడీఓ కుసుమ మాధురి అన్నారు. శనివారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎం.ఈ.ఓ. సర్ధార్ మున్సిపల్ కమిసనర్ వసంత, వైద్యదికారి మంజుల దేవి, ఏపియం వెంకట్ రెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శిల తో కలిసి ఎంపీడీఓ కుసుమ మాధురి స్వచ్చ దనం.పచ్చదనం కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయాలని ఉద్దేశ్యంతో ఈ నెల 5 నుండి స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమం చేపట్టనుందని ఈకార్యక్రమంతో ప్రతి గ్రామం పారిశుధ్యంతో స్వచ్ఛదనం, మొక్కలు నాటడంతో పచ్చదనం సంతరించుకుని గ్రామాల రూపు రేఖలు మారేలా గ్రామస్థాయి అధికారులు నాయకుల,ప్రజల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ నెల 5న గ్రామాల్లో నీస్వయం సహాయక సంఘాల మహిళలతో,యువతతో సమావేశము నిర్వహించి వారితో గ్రామాల్లో ర్యాలీలు చేపట్టాలన్నారు.ఈ నెల 6న ప్రతీ గ్రామంలో ఉన్న త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించి, క్లోరినైజేశన్ చేపట్టాలని, 7న రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమం,8న వైద్యాధికా రులతో కలసి డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడకుండా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని, 9న ప్రభుత్వ కార్యాలయ పరిసరాల ను శుభ్రం చేయించాలని, అదేవిదంగా వనమహో త్సవంలో భాగంగా మొక్కలను నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది. ఆశావర్కర్లు. మహిళల సంఘాల అధికారులు వివిధ
గ్రామాల ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు