48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలు

48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలు

విశ్వంభర, భూపాలపల్లి: ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  నేపథ్యంలో 48 గంటల  సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని  భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. పోలింగ్ సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27వ తేది సాయంత్రం 4 గంటల వరకు48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.
 ఎన్నికలు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుంపులుగా ఉండటం, ప్రచారం చేయడం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం, బల్క్ ఎస్ఎంఎస్ లు పంపడం కూడా నిషేధమని తెలిపారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సైలెన్స్ పీరియడ్ లో భాగంగా 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం ప్రచారం చేయడం, అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతోకూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం పటిష్టమైన నిఘా అమలు చేయనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పరిశీలించడంజరుగుతుందన్నారు. సైలెన్స్ పీరియడ్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం  చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహణకు వచ్చిన ఇతర జిల్లాల వ్యక్తులు జిల్లాలో ఉండొద్దని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసీసీ, పోలీస్ అధికారులు  అప్రమత్తంగా ఉండి నిశిత పరిశీలన చేయాలని తెలిపారు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జిలలో  విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆయన సూచించారు.  ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ కూడా నిషేధమని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ తెలిపారు.

Tags: