విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుండి పాతబస్తీలోని ఆలయాలకు పట్టు వస్త్రాల సమర్పణ
On
విశ్వంభర, పాతబస్తీ : ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2025 బోనాల ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే పట్టు వస్త్రాలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (విజయవాడ ) నుండి కార్యనిర్వాక అధికారి సీనా నాయక్ మరియు అర్చకులు ఉమ్మడి దేవాలయ ప్రధాన అర్చకులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉప్పుగూడ మహంకాళి ఆలయం, లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, గౌలి పురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భరతమాత & కోట మైసమ్మ దేవాలయం, మీరల మండి దేవాలయం మొత్తంగా ఎనిమిది దేవాలయాలకు పట్టు వస్త్రాలు విజయవాడ దేవస్థానం కమిటీ సభ్యులు అమ్మవారి కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ మరియు వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



