మద్యం కేసులో కవితకు షాక్.. జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు! 

మద్యం కేసులో కవితకు షాక్.. జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు! 

ఢిల్లీ మద్యం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత రిమాండ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమె బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మరోసారి చేదు అనుభవమే ఎదురయింది. మరోసారి ఈమెకు జ్యూడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. గత విచారణలో భాగంగా ఈమెకు నేటి వరకు రిమాండ్ పొడిగించింది.

ఈ క్రమంలోనే జూన్ 14వ తేదీకి ఈమె రిమాండ్ పూర్తి కావడంతో మరోసారి కవిత మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి ఈమెను విచారణకు హాజరు పరిచారు. ప్రస్తుతం మద్యం కేసులో భాగంగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కవిత రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. 

Read More ప్రపంచ బ్యాంక్ కు సలహాలిచ్చే స్థాయికి భారత్ : ఫేమస్ ఎకానమిస్ట్

ఈడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు మరోసారి ఆమెకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. 
నేటి విచారణలో భాగంగా ఈమె నుంచి మరింత విలువైన సమాచారం రాబట్టాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరడంతో ఏకంగా ఈమెకు ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో ఈమెకు మరోసారి నిరాశ తప్ప లేదని చెప్పాలి