చండూర్ గాంధీజీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 

  • ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు
  • సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

విశ్వంభర, చండూర్ : దసరా సెలవులు ప్రారంభం కానున్న దృష్ట్యా ముందస్తు బతుకమ్మ సంబరాలను స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గౌరీదేవికి పూలమాలలు వేసి పూజ చేసి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పండుగను తెలంగాణ ఆడపడుచులు వారి పుట్టింటిలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ... బంధాలు మరియు అనుబంధాలను గుర్తు చేసుకుంటూ.... ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూలతో గౌరీదేవిని పూజిస్తారని, మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మగా ముగుస్తుందని తెలిపారు. విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణతో, పూలతో అలంకరించుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల బతుకమ్మలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే ఆచారానికి ప్రతీక అని పేర్కొన్నారు. సత్యం చెడుపై గెలిచే విజయదశమి సందేశం చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్  సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 20 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/pre-batukamma-celebrations-in-chandur-gandhiji/article-6509

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.