ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరణ.. తొలిసంతకం దేనిపై చేశారంటే..!
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో మూడో దఫా తన విధులను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్ నిధిని విడుదల చేశారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో మూడో దఫా తన విధులను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్ నిధిని విడుదల చేశారు. ఈ మేరకు దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం అందనుంది.
ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా ఆ రెండు సార్లు మోడీనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంతో వరుసగా మూడోసారి పీఠమెక్కారు. నెహ్రూ తర్వాత మోడీ ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా ఏడు దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సుమారు 9వేల మంది ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.