అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు 

అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు 

వాహనదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నేటి(ఆదివారం) అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు తెలిపింది.

వాహనదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నేటి(ఆదివారం) అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు పేర్కొంది.

సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 2025 మార్చి 31వరకు అమలు కానున్నాయి. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్‌హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది. పెంచిన ఛార్జీలతో ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒకవైపు రూ.25, ఇరువైపులా రూ.35, పెంచారు. భారీ వాహనమైతే ఒకవైపు రూ.35, ఇరువైపులా రూ.50వరకు పెంచారు. నెలవారీ పాసులు రూ.330 నుంచి రూ.340కి పెంచారు.

Related Posts