నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. కొత్త మంత్రులకు మోడీ సూచనలు
కేంద్ర కేబినెట్ మంత్రి పదవులు ఖరారు అయిపోయాయి. ఈసారి కొత్తవారికి ఎక్కువ పదవులు దక్కాయి. గతం కంటే మిత్రపక్షులకు ఈసారి మంత్రి పదవులు ఎక్కువ కేటాయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం వారికి రాబోయే ఐదేళ్ల పరిపాలనపై పలు సూచనలు చేశారు.
మంత్రులు తమకు కేటాయించిన శాఖల లక్ష్యాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాలు ఏంటనేది వారికి చెప్పారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం పై నమ్మకంతో ఉన్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వంద రోజుల ప్రణాళికపై వారికి హితబోధ చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. శ్రద్ధతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు.
ఇలా పని చేసుకుంటూ పోతే 2047 కల్లా వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలిపారు. కొత్తగామంత్రి పదవులు చేపట్టిన వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మంత్రులందరూ మోడీతో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వెళ్లారు.