బిగ్ ట్విస్ట్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి కవిత!

బిగ్ ట్విస్ట్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి కవిత!

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధాకిషన్‌ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్‌లో మరోసారి సంచలనం బయటకొచ్చింది. గతంలో బీజేపీకిలో కొంతం మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పొక్కడంతో.. అప్పటి ప్రభుత్వం వారి ఫోన్లను ట్యాప్ చేసిందని తేలింది. ప్రభాకర్ రావు గైడెన్స్‌లో ఆయన టీం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. 

 

Read More ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైద్యులు

మధ్యవర్తి నందు ఫోన్లు ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చిందని తేలింది. దీంతో.. ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో డివైజ్‌లను కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డితో పాటు కొంత మంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. 

 

అయితే, బీఎస్ సంతోష్ ను అరెస్ట్ చేసి.. ఆ కేసును అడ్డంపెట్టుకొని లిక్కర్ కేసులో కవితను కాపడటానికి ప్రయత్నించాలని ప్లాన్ చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఆడియోలను ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర దించింది. కానీ.. . బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడం కుదరలేదు. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు