సీఎం మార్పుపై జగ్గారెడ్డి క్లారిటీ!

సీఎం మార్పుపై జగ్గారెడ్డి క్లారిటీ!

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు ఇకనైనా ఆపాలని అన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు కనుక.. కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందని ప్రచారం చేస్తున్నాని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వైట్ పేపర్ లాంటి వారని అన్నారు. అలాంటి వారిపై మహేశ్వర్ రెడ్డి కావాలనే ఇంక్ చల్లుతున్నారని ధ్వజమెత్తారు.

గుర్తింపు కోసం ఒకరి క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించడం మానుకోవాని మహేశ్వర్ రెడ్డికి జగ్గారెడ్డి హితవు పలికారు. ఉత్తమ్ ఆచితూచి అడుగులు వేసే వ్యక్తి అని.. ఆయన ఎవరి ట్రాప్‌లోనూ పడరని చెప్పారు. కావాలనే ఉత్తమ్‌ను బీజేపీ టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు.

Read More విప్లవ సింహం నల్లా నరసింహులు 

మరోవైపు సీఎం పదవిపై కూడా జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. రేవంతే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై ఎవరెన్ని ప్రచారాలు చేసినా.. అవన్ని అబద్దాలేనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.  రోజుకో ట్యాక్స్ పేరుతో మాట్లాడుతున్న మహేశ్వర్ రెడ్డి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీడియాకు సమర్పించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేని ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయాలని చూస్తే ఊరుకోమని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.