రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌కు నిరసనగా సంగారెడ్డిలో ముంబై హైవే ను దిగ్బంధించిన టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
జగ్గారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం, తీవ్ర తోపులాట జగ్గారెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు
On
- పోతిరెడ్డిపల్లి వద్ద హైదరాబాద్-ముంబై నేషనల్ హైవేపై తీవ్ర ఉద్రిక్తత
- హైదరాబాద్-ముంబై నేషనల్ హైవేపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మెరుపు ధర్నా
- భారీ వర్షంలోను కొనసాగిన కాంగ్రెస్ నేతల ఆందోళన
- ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ కి నిరసనగా జగ్గారెడ్డి హైవేపై బైటాయింపు
- టైర్లను తగలబెట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గారెడ్డి
- హైదరాబాద్-ముంబై హైవేపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్
- జగ్గారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం, తీవ్ర తోపులాట
- జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించే క్రమం లోపోలీస్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
విశ్వంభర,సంగారెడ్డి : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌కు నిరసనగా సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి వద్ద హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించాయి.
పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద భారీ ధర్నా:
జగ్గారెడ్డి పిలుపుతో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు భారీగా తరలివచ్చారు. జగ్గారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలంతా ఒకేసారి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సుమారు గంట పాటు ఈ రాస్తారోకో కొనసాగడంతో హైదరాబాద్-ముంబై హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట:జగ్గారెడ్డి ధర్నాకు దిగుతారనే ముందస్తు సమాచారంతో పోలీసులు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద భారీగా మోహరించారు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో, పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. జగ్గారెడ్డిని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందుల నడుమ, అతికష్టం మీద వాహనాన్ని అక్కడి నుండి ముందుకు కదిలించి ఆయన్ను తరలించారు.
🕒 22 Jul 2026 ✍️ Desk
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌కు నిరసనగా సంగారెడ్డిలో ముంబై హైవే ను దిగ్బంధించిన టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
జగ్గారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం, తీవ్ర తోపులాట జగ్గారెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు
విశ్వంభర,సంగారెడ్డి : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌కు నిరసనగా సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి వద్ద హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించాయి.
పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద భారీ ధర్నా:
జగ్గారెడ్డి పిలుపుతో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు భారీగా తరలివచ్చారు. జగ్గారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలంతా ఒకేసారి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సుమారు గంట పాటు ఈ రాస్తారోకో కొనసాగడంతో హైదరాబాద్-ముంబై హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట:జగ్గారెడ్డి ధర్నాకు దిగుతారనే ముందస్తు సమాచారంతో పోలీసులు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద భారీగా మోహరించారు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో, పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. జగ్గారెడ్డిని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందుల నడుమ, అతికష్టం మీద వాహనాన్ని అక్కడి నుండి ముందుకు కదిలించి ఆయన్ను తరలించారు.
🔗 https://www.vishvambhara.com/telangana/tpcc-working-president-jaggareddy-blocked-the-mumbai-highway-in-sangareddy/article-19229