రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జూన్ 2న తొలిసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకులను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి భావించింది. పైగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. దీంతో.. ఈ వేడుకులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈసీ నుంచి అనుమతి వస్తుందా? రాదా? అనే ఉత్కంఠకు తెరపడింది. 

 

Read More సడక్ తాండకు బోరు మోటరు అందజేసిన లయన్స్ క్లబ్

ఆవిర్భావ వేడుకుల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు సీఎస్ ప్రకటించారు. ఆ రోజు మొదట సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పింస్తారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

 

ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో ప్రతీ చిన్న కార్యక్రమానికి కూడా ఈసీ అనుమతి తప్పని సరి అవుతోంది. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణలో ప్రమేయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఈ వేడుకలో భాగం చేయొద్దని ఈసీ ఆదేశించింది.