అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం!
అంబటి రాయుడుపై కోహ్లీ అభిమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంబటి రాయుడి ఫ్రెండ్ సామ్ పాల్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ పోస్టు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని హత్య చేస్తామని.. అతని పిల్లలు, భార్యను అత్యాచారం చేసి చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగడాలకు హద్దే లేకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. గెలుపోటములు ఎక్కడైన సహజమేనని ఆయన చెప్పాడు. కోహ్లీని అంబటి రాయుడు విమర్శించాడని దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు.
కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్ అంబటి రాయుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారని ఆరోపించాడు. రాయుడి భార్య, పిల్లలనే దుండగులు లక్ష్యంగా చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డాడు. ఈ విషయంలో పోలీసులు, న్యాయస్థానం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సామ్ పాల్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశాడు.
ఇటీవల అంబటి రాయుడు.. కోహ్లీపై విమర్శలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ దక్కించుకోలేరని విమర్శించాడు. ఈ కామెంట్స్‌తో అంబటి రాయుడిపై చాలా మంది విమర్శలు వ్యక్తం చేశారు. కోహ్లీ ఫ్యాన్స్ ఆయన్ని టార్గెట్ చేశారు. అయితే.. ఇప్పుడు దాడి ప్రయత్నిస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.