అందుకే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్  

అందుకే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్  

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తరచూ తిరుమల వెళ్తుంటుంది. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామివారిని దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తిరుమలకు తరచూ వెళ్లడానికి గల కారణాన్ని వివరించింది.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తరచూ తిరుమల వెళ్తుంటుంది. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామివారిని దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తిరుమలకు తరచూ వెళ్లడానికి గల కారణాన్ని వివరించింది. తనతల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు జాన్వీ తెలిపింది.

‘అమ్మ కంటే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నా.. అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేది. షూటింగ్ గ్యాప్‌లో నారాయణ, నారాయణ అనుకుంటుండేది. ప్రతి ఏడాది పుట్టినరోజున స్వామివారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యా. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచు వెళ్తుంటాను’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

Read More అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్.. 

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా