అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్.. 

అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లోనే కాదు.. బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్పటికే చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతో మందికి కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారు. దాంతో పాటు ఆయన వద్దకు వస్తున్న ఎంతో మందికి తనవంతు సాయం చేస్తూనే వస్తున్నారు సూపర్ స్టార్ మహేశ్. 

Read More క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ వీడియో..!!

ఇప్పుడు తాజాగా తన అభిమాని కుటుంబానికి అండగా నిలబడి.. ఆ కుటుంబానికి దేవుడయ్యాడు. కృష్ణా జిల్లా పెదప్రోలుకు చెందిన రాజేష్‌.. మొదటి నుంచి సూపర్ స్టార్ కుటుంబానికి అభిమాని. అప్పట్లో కృష్ణ, ఆ తర్వాత మహేశ్ బాబుకు అభిమానిగా ఉండేవాడు రాజేష్. అయితే రీసెంట్ గా అతను కిడ్నీలు చెడిపోవడంతో మంచాన పడ్డాడు. 

ఈ విషయం తన అభిమానుల ద్వారా తెలుసుకున్న మహేశ్ బాబు.. ముందుకు వచ్చాడు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానిని హామీ ఇచ్చాడు. దాంతో పాటు రాజేష్ ముగ్గురు పిల్లల చదువులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తానంటూ మాటిచ్చాడు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ స్టోరీగా పెట్టడంతో వైరల్ అవుతోంది. అంతా మహేశ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా