మంజుమ్మల్ బాయ్స్ టీంకు ఇళయరాజా నోటీసులు..!

తమ అనుమతి లేకుండా  ‘గుణ’ చిత్రంలోని ‘కన్మణి అన్బోడు’ పాటను వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరఫు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు. కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవని స్పష్టం చేశారు.

ఇటీవల విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.200కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా క్లైమాక్స్‏లో 1991లో కమల్ హాసన్ నటించిన ‘గుణ’ చిత్రంలోని ‘కన్మణి అన్బోడు’ పాటను ఉపయోగించారు. 

అప్పట్లో గుణ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. ఈ సాంగ్ ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యింది. అటు సోషల్ మీడియలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అయితే తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరఫు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు. కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవని, అలాంటప్పుడు తమ సినిమాలో ఈ పాటను ఉపయోగించాలంటే హక్కులు పొందాలంటే వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. 

లేదంటే కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల దీనిపై చిత్రయూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఇళయరాజా ఇదివరకు రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ సినిమా టీజర్‌లో తన సంగీతాన్ని అనుమతి లేకుండా వాడినట్లు సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపించారు. ప్రస్తుతం మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

🕒 23 May 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/movies/ilayaraja-notices-to-manjummal-boys-team/article-628

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.