విశ్వంభరలో చిరుతో ఐదుగురు హీరోయిన్లు!

విశ్వంభరలో చిరుతో ఐదుగురు హీరోయిన్లు!

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఐకాన్ లా ఉంటారు. వయసు పెరిగే కొద్ది ఆయనలో క్రేజ్ పెరుగుతోంది తప్పా తగ్గడం లేదు. ఇటీవలే పద్మ విభూషణ్ అందుకున్న ఆయన వరుస సినిమా షూటింగ్‌లతో రెడీ అవుతున్నారు. చిరంజీవి నటించిన విశ్వంభర త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వశిష్ఠ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీంతో.. స్టాలిన్ కాంబోను మెగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. త్రిష ఇప్పటికే షెట్స్ పైకి వెళ్లారు. షూటింగ్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఫిల్మినగర్‌లో వైరల్ అవుతోంది. 

 

Read More పుష్పరాజ్ కు రామ్ పోతినేని పోటీ.. నిలబడతాడా..?

చిరు సరసన త్రిషతో పాటు.. మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆషికా రంగనాథ్, మీనాక్షీ చౌదరి, సురభి, ఈషా చావ్లా కూడా విశ్వంభరలో ఉన్నారని అంటున్నారు. అయితే, త్రిష మెయిన్ రోల్‌లో ఉంటారని .. మిగిలిన వాళ్లు సపోర్టింగ్ క్యారెక్టర్లుగా ఉంటారని తెలుస్తోంది. అయితే.. ఆ నలుగురికి కూడా మంచి పాత్రలే దక్కాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

Read More పుష్పరాజ్ కు రామ్ పోతినేని పోటీ.. నిలబడతాడా..?

ఇక ఈ వార్తపై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో సంబరాలు చేస్తున్నారు. ఏజ్ పెరిగే కొద్ది బాస్‌కి క్రేజ్ పెరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతమంది హీరోయిన్స్‌తో ఉమెన్స్ హాస్టల్ నడిపిస్తాడా? అని సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది అయితే.. హిట్లర్ సీక్వెల్ తీస్తున్నాడా? అని అంటున్నారు. మొత్తానికి ఎవరి క్యారెక్టర్ ఏంటో తేలాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా