థియేటర్లు మూసివేయడంపై కీలక ప్రకటన చేసిన ఫిలిం ఛాంబర్!
సాధారణంగా వేసవి కాలంలో పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి కానీ ఈసారి మాత్రం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్లన్నీ కూడా...
సాధారణంగా వేసవి కాలంలో పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి కానీ ఈసారి మాత్రం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్లన్నీ కూడా బోసిపోతున్నాయి ఈ క్రమంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకులు రావడమే కరువయ్యారు .దీంతో నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయని థియేటర్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో సుమారు పది రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లో అన్నింటిని మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూసివేయాలి అన్నది పూర్తిగా ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం అని వెల్లడించారు.
ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే సమయంలో ఎగ్జిబిటర్లు తమని సంప్రదించలేదని ఫిలిం ఛాంబర్ తెలియచేసింది.. ఈ విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసి వేసే నిర్ణయంతో మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇది థియేటర్ యాజమాన్యులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.